: 'డ్రగ్స్' వాడుతున్న టాలీవుడ్ జనాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!


టాలీవుడ్ లో సుమారు 40 మందిపై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయని, అందులో 19 మందికి నోటీసులు పంపామని ఎక్సైజ్ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో పది మంది నోటీసులు స్వీకరించగా, 9 మంది అందుబాటులో లేరని, వారికి మళ్లీ నోటీసులు పంపామని అధికారులు వెల్లడించారు. దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. డ్రగ్స్ వినియోగదారులంటూ తెరపైకి వచ్చినవారంతా స్వయం కృషితో చిత్రపరిశ్రమలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న వారేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. వారికి సరైన బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉంటే వారి పేర్లు బహిర్గతమయ్యేవా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.

మరికొందరు మాత్రం డ్రగ్స్ వినియోగానికి, బ్యాక్ గ్రౌండ్ కి ఎలాంటి సంబంధం ఉండదని, వ్యసనానికి బానిసైతే ఎవరైనా ఒకటేనని పేర్కొంటున్నారు. చిత్రపరిశ్రమలో అందమైన రూపం, చక్కటి శరీరాకృతి తెచ్చుకునేందుకు డ్రగ్స్ వినియోగం ఉంటుందని, ఇది బహిరంగ రహస్యమేనని మరికొందరు చెబుతున్నారు. కావాలంటే డ్రగ్స్ ఆరోపణల్లో బయటకు వచ్చిన సినీ నటుల కెరీర్ తొలినాళ్ల ఫోటోలు లేదా సినిమాలు, ఇప్పటి సినిమాలు చూడాలని, అలా చేస్తే వారి శరీరంలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని, వయసు పెరుగుతున్నా ఎలాంటి మార్పు లేకుండా కనిపించాలంటే అలాంటి అలవాట్లు ఉండే ఉంటాయని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News