: సిట్ అధికారులను కలిసిన ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు


విశాఖపట్నంలో వెలుగుచూసిన భూ రికార్డుల తారుమారు దందాపై నిజా నిజాలను వెలికి తీసేందుకు చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన సిట్ బృందం ముందుకు ఈ ఉదయం మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వచ్చారు. గతంలో తాను వెల్లడించిన ఆరోపణలనే ఫిర్యాదు రూపంలో సిట్ కు ఇచ్చారు. ప్రభుత్వ భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ. 190 కోట్లకు పైగా రుణాలను పొందారని, ఇది దారుణమైన వ్యవహారమని ఆరోపించారు.

ప్రభుత్వ భూములను కాజేసి, రికార్డులు తారుమారు చేసి, అవి తమవేనని నమ్మించి, కోట్ల రూపాయల రుణాన్ని పొందారని తెలిపారు. పెదగంట్యాడలో మట్టెక్ పార్క్ కోసం ఈ దందా నడిచిందని పేర్కొంటూ తన వద్ద ఉన్న వివరాలను సిట్ అధికారులకు ఇచ్చారు. రెండేళ్ల క్రితమే తాను మంత్రి హోదాలో రుణాలు ఆపాలని లేఖ రాసినా పట్టించుకోలేదని తెలిపారు. మరో నాలుగైదు రోజులలో ఇంకొన్ని ఆధారాలను ఇస్తానని అయ్యన్నపాత్రుడు సిట్ అధికారులకు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News