: ఒక్కొక్కరికి ఒక్కో డేట్ ఇచ్చిన సిట్... ఎవరిని ఎప్పుడు విచారణకు పిలిచారంటే..!


తెలుగు చిత్ర పరిశ్రమలోని 12 మందికి నోటీసులు పంపిన సిట్, వారు విచారణకు ఎప్పుడు, ఎక్కడ హాజరు కావాలన్న విషయాన్ని స్పష్టంగా తెలిపింది. ఈ పన్నెండు మందిలో 10 మందికి నోటీసులు వెళ్లినట్టు అక్నాలెడ్జ్ మెంట్ అందగా, మరో ఇద్దరికి ఈ ఉదయం నోటీసులు వెళ్లాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజును 21వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య ఎక్సైజ్ కార్యాలయంలోని ఐదో అంతస్తులో ఉన్న సిట్ ఆఫీసుకు రావాలని ఆదేశించారు. నవదీప్ ను 24వ తేదీ అదే ప్రాంతానికి రావాలని సూచించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మీ, ముమైత్ ఖాన్ లను 23న విచారణకు రావాలని ఆదేశించారు. చిన్నా, శ్యామ్ కే నాయుడులను కూడా 21వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. తరుణ్, రవితేజలను ఎప్పుడు విచారణకు పిలిచారన్న విషయమై సమాచారం వెలువడాల్సి వుంది.

  • Loading...

More Telugu News