: డ్రగ్స్ వినియోగంపై తనీష్ వివరణ!


డ్రగ్స్ తీసుకున్నారంటూ వెలువడ్డ జాబితాలో తనపేరు ఉండడంపై టాలీవుడ్ యువ నటుడు తనీష్ స్పందించాడు. తాను షూట్ లో ఉండగా తన తల్లి ఫోన్ చేసి, టీవీలో వస్తున్న వార్తలపై సమాచారం ఇచ్చిందని తెలిపాడు. తన కుమారుడు డ్రగ్స్ తీసుకున్నాడంటే ఏ తల్లి పరిస్థితైనా ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించాడు. తన తండ్రి మరణం విషాదం నుంచి ఇంకా తాము కోలుకోలేదని తనీష్ చెప్పాడు. అలాంటి సమయంలో ఇలాంటి దుష్ప్రచారం తమ కుటుంబాన్ని ఎంత కుంగదీస్తుందో చెప్పాలని తనీష్ ప్రశ్నించాడు. తనకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని, తనకు నోటీసులు కూడా రాలేదని, తనపేరు ఎలా బయటకు వచ్చిందో తెలియదని తెలిపాడు. తనకు అలాంటి అలవాట్లు లేవని, ఇప్పుడు బురద జల్లడం వల్ల ఏమొస్తుందని మీడియాను ప్రశ్నించాడు. తనపై దుష్ప్రచారం ఆపాలని తనీష్ కోరాడు. 

  • Loading...

More Telugu News