: డ్రగ్స్ కేసులో పేర్లు లీక్ కావడంపై అకున్ సబర్వాల్ ఆగ్రహం!
డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో కలకలం రేగుతోంది. అయితే ఈ పేర్లు లీక్ కావడం పట్ల ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సీనీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశామని, అయితే ఎవరి పేర్లనూ బయటకు వెల్లడించలేదని చెప్పారు. నోటీసులు జారీ అయిన వారిలో ప్రముఖులు కూడా ఉండటంతో ఎక్సైజ్ అధికారులపై తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, త్వరలోనే అకున్ సబర్వాల్ సెలవుపై వెళుతున్నారు. అయితే, వ్యూహాత్మకంగానే మీడియాలో పేర్లు వచ్చేలా చేశారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.