: నా భర్త అలాంటి వాడంటే నమ్మను: సింగర్ గీతామాధురి
తన భర్త మాదక ద్రవ్యాలు వాడుతున్నాడంటే తాను నమ్మబోనని గాయని గీతా మాధురి వ్యాఖ్యానించింది. తన భర్త నందుకు సిట్ పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయని మీడియాలో వార్తలు చూసి అవాక్కయ్యానని అంది. తనను కలిసిన ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, నందుకు ఎటువంటి చెడు అలవాట్లూ లేవని స్పష్టం చేసింది. ఒకవేళ డ్రగ్స్ తీసుకునే అలవాటే ఉంటే, తనకు తప్పకుండా తెలిసేదని చెప్పుకొచ్చింది. ఒకవేళ పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపితే, తానే స్వయంగా పంపిస్తానని స్పష్టం చేసింది. మీడియా ఇటువంటి అనధికార వార్తలను ప్రచారం చేయడం తగదని పేర్కొంది.