: ఐఫా 2017 మొదటిరోజు ముచ్చట్లు... సందడి చేసిన బాలీవుడ్ జంటలు
అమెరికాలోని న్యూయార్ నగరంలో ఐఫా 2017 సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే విచ్చేసిన బాలీవుడ్ తారలతో మొదటిరోజు వేడుక చాలా సందడిగా జరిగింది. షెరటాన్ స్క్వేర్ హోటల్లో జరిగిన ప్రెస్‌మీట్‌కు సల్మాన్‌ఖాన్, షాహిద్ కపూర్, అనుపమ్ ఖేర్, కత్రినా కైఫ్, ఆలియా భట్, సుషాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్, వరుణ్ ధావన్‌లు హాజరయ్యారు. వీరిని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు.
ప్రెస్‌మీట్ తర్వాత వరుణ్ ధావన్ చేసిన డ్యాన్స్‌కు అమెరికా అభిమానులు కూడా చిందులు వేశారు. తర్వాత జరిగిన ఫ్యాషన్ షోలో దియా మీర్జా, తాప్సీ, శిల్పా శెట్టి, నేహా ధూపియా, హ్యూమా ఖురేషీలు ర్యాంప్‌పై నడిచి అలరించారు. వీరితో పాటు `ఎంఎస్ ధోనీ` భామ దిశా పటానీ నడక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఐఫా ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ఇక రెండో రోజు వేడుకలో భాగంగా అతిపెద్ద మ్యూజికల్ గలాటా ప్రారంభంకానుంది. ఇందులో హరిహరన్, కైలాష్ ఖేర్, మిఖా సింగ్, మోహిత్ చౌహాన్, శేషాద్రి, కమాల్ ఖాన్ వంటి దిగ్గజ గాయకులు పాటలు పాడనున్నారు. చివరి రోజైన జూలై 15న అవార్డుల పండగ జరగనుంది. ఈ వేడుకకు మనీష్ పాల్, రితేష్ దేశ్‌ముఖ్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు.