: యూపీ అసెంబ్లీలో కలకలం రేపిన పేలుడు పదార్థం!
గురువారం ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుండగా గుర్తుతెలియని తెల్లని పౌడర్ సంచి ఒకటి అసెంబ్లీలో కనిపించింది. 60 గ్రాముల ఈ తెల్లని పౌడర్ అనుమాస్పదంగా కనిపించడంతో అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దీన్ని పెంటాఎరిత్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్) అనే పేలుడు పదార్థంగా ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. ప్లాస్టిక్ సంచిలో మడచి ఉన్న తెల్లని పౌడర్ ఎమ్మెల్యే కుర్చీ కింద లభించడం భద్రతాధికారుల్లో కలకలం రేపుతోంది. అదృష్టవశాత్తు గుర్తించారు కాబట్టి సరిపోయిందని, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగిపోయేదని వారు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి యోగిఆద్యితానాథ్ భద్రతాధికారులతో సమావేశం కానున్నారు. ప్రతిపక్ష నేత సీటు కింద ఈ పేలుడు పదార్థం లభించినట్లు సమాచారం.