: నవదీప్ ను కాపాడేందుకు రంగంలోకి దిగిన ఐదుగురు అగ్రహీరోలు?
డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న నవదీప్ ను కాపాడేందుకు ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగారని సమాచారం. టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగిన ప్రతిసారీ నవదీప్ పేరుపై చర్చ జరుగుతోంది. తాజాగా ఎక్సైజ్ శాఖ టాలీవుడ్ లింకులపై దర్యాప్తు ప్రారంభించిన వెంటనే నవదీప్ అప్రమత్తమయ్యాడని సమాచారం. దీంతో నవదీప్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఐదుగురు అగ్రహీరోలను రంగంలోకి దించాడని తెలుస్తోంది. నవదీప్ ఆ ఐదుగురు అగ్రహీరోలకు ఎప్పటికప్పుడు కాస్ట్ లీ పార్టీలు అరేంజ్ చేసేవాడని సమాచారం. దీంతో నవదీప్ పై వారికి అంతులేని ఆపేక్ష అని, దీంతోనే వారు నవదీప్ ను రక్షించేందుకు రంగంలోకి దిగారని తెలుస్తోంది.