: నాకు నోటీసులేంటి?... నేను సిగరెట్ కూడా తాగను: ఆర్ట్ డైరెక్టర్ చిన్నా
కనీసం సిగరెట్ కూడా తాగని తన పేరు డ్రగ్స్ దందాలో రావడం, పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వస్తుండటం తనకెంతో బాధను కలిగిస్తోందని ఆర్ట్ డైరెక్టర్ చిన్నా వ్యాఖ్యానించాడు. ఎక్సైజ్ శాఖ నుంచి తనకు ఎలాంటి నోటీసులూ రాలేదని స్పష్టం చేసిన ఆయన, ఈ ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవమని, తాజా బ్రేకింగ్ న్యూస్ తో తన కుటుంబం ఎంతో బాధపడుతోందని వాపోయాడు. తనకు నోటీసులు అందితే విచారణకు వెళ్లేందుకు ఎటువంటి అభ్యంతరాలూ లేవని స్పష్టం చేశాడు. డ్రగ్స్ దందా గురించి గానీ, అది సాగే విధానం కానీ తనకు తెలియవని, కెల్విన్ పేరును కూడా తాను వినలేదని చెప్పుకొచ్చాడు.