: డ్రగ్స్ మత్తు వీరి చుట్టేనని అందరికీ తెలుసు... వారి పేర్లను ముందే ఊహించేశారు కూడా!
బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి ఎన్నో హిట్ చిత్రాలు చేసి, ప్రస్తుతం సినిమాలు లేఖ ఖాళీగా ఉన్న హీరో... తరుణ్.
అలాగే హిట్ సినిమాల్లో నటించి, ఇప్పుడు చిత్రాలు లేక ఖాళీగా ఉన్న యువ హీరో... నవదీప్.
ముంబైలో ఉండి ఐటమ్ సాంగ్స్ కోసం హైదరాబాద్ వచ్చి పోయే సెక్స్ బాంబ్... ముమైత్ ఖాన్.
ప్రముఖ యువగాయని గీతామాధురి భర్త నందు.
సినిమాలు త్వరగా పూర్తి చేస్తారని పేరున్న సంచలన డైరెక్టర్... పూరీ జగన్నాథ్.
హిట్ చిత్రాల్లో నటిస్తూ, ప్రొడక్షన్ పనులను కూడా పర్యవేక్షిస్తూ, నిర్మాతలకు సహకరించే హీరోయిన్... చార్మి.
వీరందరి పేర్లూ డ్రగ్స్ దందాలో నేడు బయటకు వచ్చాయి. కానీ, నిన్న మొన్ననే వీరి పేర్లపై పోలీసు వర్గాలు లీకులు ఇచ్చాయి. డైరెక్టుగా పేర్లను చెప్పకుండా వారు చేస్తున్న పనులు, వారికి ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపును చెబుతూ లీకులు ఇచ్చాయి. సినీ అభిమానులు కూడా వీరి పేర్లు ఉంటాయని ముందుగానే ఊహించేశారు కూడా. ఇక వీరిని విచారణకు పిలిచిన పోలీసులు, తాము వాడేందుకే డ్రగ్స్ ఆర్డర్ చేశారా? లేక మరెవరికైనా ఇచ్చేందుకు లేదా విక్రయించేందుకు ఆర్డర్ చేశారా? అన్న విషయాన్ని తేల్చనున్నారు. డ్రగ్స్ కు బానిసలై వాడుతూ ఉంటే, కౌన్సెలింగ్, రీహాబిలిటేషన్ సెంటర్లకు సిఫార్సులు చేస్తామని, వారు వేరే వారికి ఇవ్వడం లేదా విక్రయించడం చేసినట్టు తెలిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇక టాలీవుడ్ లో మత్తు దందాపై నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు అకున్ సబర్వాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.