: అయ్యో.. ఆ మెసేజ్ నాది కాదు, ట్విట్టర్ అకౌంట్ కూడా నాది కాదు: శివాజీరాజాపై విమర్శలపై నటి తులసి


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజాపై సీనియర్ నటి తులసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన అవార్డుల ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ ను రానీయకుండా ఆపింది శివాజీరాజానే అని ఆమె ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై శివాజీరాజా మండిపడ్డాడు. చట్టపరమైన చర్యలకు కూడా ఆయన సిద్ధమయ్యాడు.

దీంతో, తులసి వెనకడుగు వేసింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అలాంటి మెసేజ్ లు తాను ట్విట్టర్ లో పోస్ట్ చేయలేదని... అసలు, ఆ ట్విట్టర్ అకౌంట్ కూడా తనది కాదని ఆమె తెలిపింది. కావాలంటే తన ట్విట్టర్ అకౌంట్ ను చెక్ చేసుకోవచ్చని కూడా అంది. మరో విషయం ఏమిటంటే, ఇంత వివాదానికి కారణమైన ఆ ట్విట్టర్ మెసేజ్ ఇప్పుడు కనిపించకుండా పోయింది. 

  • Loading...

More Telugu News