: మర్డర్లు, మానభంగాలు, ఛీటింగ్ లు నేర్చుకుంటే తప్ప యువత రాజకీయాల్లోకి రాలేదు: సినీ నటుడు శివాజీ
ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై సినీ నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ మొత్తం నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో చేరినా ఏముంది గర్వకారణం? అని ప్రశ్నించారు. అన్ని పార్టీలు ఒకేలా ఉన్నాయని... తనకు ఏ పార్టీలోనూ చేరాలని లేదని, ప్రజల కోసం మాత్రం తన గొంతుక వినిసిస్తూనే ఉంటానని చెప్పారు. ఇలాంటి రాజకీయనేతల మధ్య నాయకుడిగా రావాలనుకునే యువత... మర్డర్లు, మానభంగాలు, ఛీటింగ్ లు ఇవన్నీ నేర్చుకుని వస్తే తప్ప... ఈ రంగంలో మనలేరని చెప్పారు. కులం, మతం, వర్గం మీద ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2009 నుంచి ప్రత్యక్షంగా ప్రజల్లో ఉన్నానని... ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మళ్లీ సినిమాలు చేయబోతున్నానని తెలిపారు.