: సభ్యత మరచిన ట్రంప్... ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్యపై అభ్యంతరకర వ్యాఖ్యలు


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సభ్యత మరచి మరోసారి ప్రవర్తించారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ట్రంప్ (71), మెలానియా (47) దంపతులను సాదరంగా ఆహ్వానించేందుకు ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ (39), ఆయన భార్య బ్రిగెట్టీ మాక్రాన్ (64) వచ్చారు. ఈ సమయంలో ట్రంప్ మాక్రాన్ భార్యతో పెక్ (బుగ్గ బుగ్గ రాసుకుని పలకరించడం) తీసుకున్నారు. అనంతరం ఆమె చేయిపట్టి లాగుతూ, భార్య పక్కన ఉండగానే... నీ షే...అంటూ అసభ్యంగా మాట్లాడారు.

అయితే ఆయన పలకరింపును హుందాగా తీసుకున్న బ్రిగెట్టీ మాక్రాన్ మెలానియా పక్కకు వచ్చి నిల్చున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రంప్ నోటి దురదపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ కు సంస్కారం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇతర దేశాధినేత భార్యతో ఎలా వ్యవహరించాలో కూడా తెలియదా? అంటూ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. 

  • Loading...

More Telugu News