: నిర్భయ రేప్ లాంటి దారుణానికి పాల్పడ్డాడు: లాలూ కుమారుడిపై బీజేపీ నేత తీవ్ర ఆరోపణలు


లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పై బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. నిర్భయ కేసులో బాలనేరస్తుడు తేజస్వి అంటూ ట్విట్టర్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూతిమీద మీసాలు రాని వయసులోనే నిర్భయ రేప్ లాంటి దారుణానికి ఒడిగట్టాడని చెప్పాడు. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి అక్రమాస్తులను పెద్ద ఎత్తున కూడబెట్టడంలో ఆశ్చర్యం ఏముందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది. సుశీల్ మోదీ చేసిన వ్యాఖ్యలు బీజేపీ వ్యాఖ్యలుగా పరిగణించాలా? అని ప్రశ్నించింది. 

  • Loading...

More Telugu News