: 'డ్రగ్స్' ఉచ్చులోని సినీ ప్రముఖల విచారణ రహస్య ప్రదేశంలో?


డ్రగ్స్ రాకెట్ తో లింకులున్న సినీ ప్రముఖలను ఈ నెల 19 నుంచి 25 వరకు విచారించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డ్రగ్స్ దందాతో లింకులున్న నిందితులను సిట్ ఆఫీసులో విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినీ ప్రముఖులను సిట్ ఆఫీసులో విచారించే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. సినీ ప్రముఖుల ఇమేజ్ కు భంగం వాటిల్లకుండా వారిని రహస్య ప్రదేశంలో విచారించనున్నట్టు తెలుస్తోంది.

ఈ విచారణకు సంబంధించిన సమాచారం విచారణ రోజు ఉదయం వారికి ఫోన్ ద్వారా చెబుతారని, వారు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే వారి అసిస్టెంట్లను మాత్రం సిట్ కార్యాలయంలోనే విచారించనున్నారని తెలుస్తోంది. వారికి ముందుగా ఎలాంటి సమాచారం అందదని ఈ నెల 19 నుంచి 25 మధ్య వారిని విచారించనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News