: నమ్మశక్యం కాకున్నా నిజం! జీవిత భాగస్వాములను మోసం చేస్తున్న వారిలో వృద్ధులే అధికం.. వివాహేతర సంబంధాలు వారిలోనే ఎక్కువట!


నమ్మడానికి కొంచెం కష్టమే అయినా ఇది నిజమే. యువ దంపతులతో పోలిస్తే వృద్ధులే ఎక్కువగా తమ భాగస్వాములను మోసం చేస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి తెలిపింది. ఇనిస్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ కథనం ప్రకారం.. 55 ఏళ్లు దాటిన 20 శాతం మంది పెళ్లైన అమెరికన్లు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. 55 ఏళ్ల లోపు ఉన్న వారిలో ఇటువంటి సంబంధాలు కేవలం 14 శాతం మాత్రమే. పెళ్లయి సుదీర్ఘకాలం గడవడంతో భాగస్వాములను చాలా సులభంగా మోసం చేసే వీలు వారికి చిక్కుతోందని అధ్యయనం అభిప్రాయపడింది.

అదే సమయంలో 18-55 ఏళ్ల లోపు వివాహ బంధంలో ఉన్న వారిలో వివాహేతర సంబంధాలు గణనీయంగా తగ్గాయి. అలాగే పోలియమొరీ (బహుభార్యత్వం), ఎథికల్ నాన్- మోనోగమీ (భార్య అంగీకారంతో ఇతరులతో సంబధం పెట్టుకోవడం) విస్మరణ ఎక్కువయ్యాయని అధ్యయనంలో తేలింది. ఫలితంగా భాగస్వామి అంగీకారంతోనే పరాయి వ్యక్తులతో శృంగారంలో పాల్గొంటున్న విషయం బయటపడింది. అయితే ఎంతమంది పోలియమొరిస్ట్‌లు ఉన్నారన్న విషయం ప్రస్తుతం అప్రస్తుతమైనా అమెరికా వృద్ధుల్లో ఇదిమాత్రం బాగా పెరిగినట్టు అధ్యయనకారులు గుర్తించారు. వివాహేతర సంబంధాలను చాలామంది ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నా దాదాపు 16 శాతం మంది మాత్రం 30 ఏళ్లుగా తమ జీవిత భాగస్వాములను ఈ విషయంలో మోసం చేస్తూనే ఉన్నారని అధ్యయనం వివరించింది.

  • Loading...

More Telugu News