: ఆమధ్య మరణించిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా డ్రగ్స్ ఇచ్చాను: కెల్విన్ నోట రహస్యాలు


టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. కెల్విన్ ముఠా వెల్లడించిన డ్రగ్ వినియోగదారులు, పెడ్లర్ల జాబితాతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో భారీ ఎత్తున టాలీవుడ్ లింకులు బట్టబయలయ్యాయి. డ్రగ్స్ తీసుకునే సినీ నటులందరికీ గచ్చిబౌలిలోని ఒక పబ్ అడ్డా అని అధికారులు గుర్తించారు. సినిమాలు వేగంగా తీస్తాడని పేరున్న దర్శకుడు డ్రగ్స్ తీసుకుంటాడని తేలింది. ఆమధ్య టాలీవుడ్ లో మృతి చెందిన ఓ మ్యూజిక్ డైరెక్టర్ కి, ఓ నటుడికి తానే డ్రగ్స్ ఇచ్చినట్టు కెల్విన్ తెలిపాడు. వారిద్దరికీ నిత్యం డ్రగ్స్ సరఫరా చేశానని వెల్లడించాడు.

ఓ వర్ధమాన గాయని భర్త డ్రగ్స్ తీసుకుంటాడని కెల్విన్ చెప్పాడు. బాలనటుడిగా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి నటుడిగా మారి అవకాశాల్లేని నటుడికి కూడా డ్రగ్స్ తో సంబంధం ఉందని తేల్చారు. ముగ్గురు యువ నటులు, ముగ్గురు స్టార్ నటులు, ముగ్గురు హీరోయిన్లు, ఒక స్టార్ దర్శకుడు ఇలా చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేశానని కెల్విన్ వివరించినట్టు సమాచారం. దీంతో ఈ నెల 19 నుంచి 25 తేదీ వరకు సినీ పరిశ్రమకు చెందిన స్టార్లను విచారణ చేయడానికి ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది.

  • Loading...

More Telugu News