: టెస్టుల్లో ప్రపంచంలోనే అతిచెత్త రికార్డ్.. నోబాల్స్‌లో 13 వికెట్లు పడగొట్టిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్!


దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నె మోర్కల్‌ను దురదృష్టం వెక్కిరించింది. ఫలితంగా టెస్టుల్లో ప్రపంచంలోనే ఎవరూ కోరుకోని రికార్డును సొంతం చేసుకున్నాడు. నోబాల్స్‌లో 13 వికెట్లు తీసిన ‘వీరుడి’గా అరుదైన ‘ఘనత’ సాధించాడు. నోబాల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన అరుదైన రికార్డును మోర్కెల్ సొంతం చేసుకున్నాడు.

లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో బెన్‌స్టోక్స్‌ను మోర్కెల్ అవుట్ చేశాడు. అయితే అదికాస్తా నోబాల్ కావడంతో ఈ రికార్డు అతని సొంతమైంది. దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన మోర్కెల్ తనకు దక్కిన రికార్డుపై మాట్లాడుతూ.. ఇదో కోరుకోని రికార్డని పేర్కొన్నాడు. అయితే నోబాల్స్ వేయడం తన జీవితంలో ఇదే తొలిసారి కాదని, తన కెరీర్ ఇక్కడితో ముగిసిపోదని తెలిపాడు.

  • Loading...

More Telugu News