: ఇంట్లోనే కూర్చుని మగ్గిపొమ్మంటారా?.. చెప్పండి: విలేకరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సమంత
చెన్నై బ్యూటీ సమంతకు, అక్కినేని వారి అబ్బాయి, నటుడు నాగచైతన్యకు ఈ ఏడాది అక్టోబరులో పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత సమంత సినిమాల్లో నటిస్తుందా? అనే ప్రశ్నకి శామ్ ఇప్పటికే ఎన్నోసార్లు సమాధానం చెప్పింది. తాను పెళ్లయిన తరువాత కూడా నటిస్తూనే ఉంటానని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ అమ్మడుకి ఈ ప్రశ్న మాత్రం ప్రతిసారీ ఎదురవుతూనే ఉంటుంది.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంతకు మళ్లీ విలేకరుల నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో సమంతకు చిర్రెత్తుకొచ్చింది. ఇదే ప్రశ్నను ఏ వైద్యుడినో, ఇంజినీరునో, ఉపాధ్యాయురాలినో వేస్తారా? వారు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే వృత్తిలో ఉంటారు కదా? అని సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లోనే కూర్చుని మగ్గిపొమ్మంటారా? అని ఘాటుగా ప్రశ్నించింది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది.