: ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలాకాలం ఆగాను: నటుడు అనిల్ కపూర్
బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించిన ‘ముబారకన్’ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాన్ని‘సరిగమప లిటిల్‌ఛాంప్స్’ సీజన్ 6లో నిర్వహించారు. అనిల్ కపూర్ తొలిచిత్రం ‘మేరీ జంగ్’లోని ‘జిందగీ హర్ కదమ్..’ పాటను ఓ చిన్నారి పాడారు. ఈ సందర్భంగా అనిల్ కపూర్ మాట్లాడుతూ, ఈ సినిమాకి సంతకం చేసిన వెంటనే, తన ప్రియురాలు సునీత ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుందామని అడిగానని చెప్పారు. అయితే, పెళ్లి మాత్రం వెంటనే చేసుకోవడం కుదరలేదట. చాలాకాలం ఆగాడట. ఎందుకంటే, తన భార్యకు అన్ని విధాలా విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వాలని అనుకున్నానని, అందుకు, అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే సునీతను పెళ్లి చేసుకున్నానని అనిల్ కపూర్ చెప్పుకొచ్చారు.