: చైనా నుంచి బంగ్లాదేశ్‌కు రెండు జలాంతర్గాములు
చైనా నుంచి తాము రెండు జలాంతర్గాములను కొనుగోలు చేసినట్లు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రకటన చేశారు. ప్రస్తుతం భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల ఆర్మీ భారీగా మోహరించిన వేళ ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు షేక్ హసీనా ఇదే సమయంలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయ దృష్టితో చూడకూడదని షేక్ హసీనా అన్నారు.
ఇందులో మరో అర్థమేమీ లేదని, తమ దేశ భద్రతలో భాగంగానే ఈ సబ్‌మెరైన్‌లను కొనుగోలు చేశామని తెలిపారు. తాము 2013లోనే వీటిని 203 మిలియన్ డాలర్లతో కొనే అంశంపై చైనాతో ఒప్పందం చేసుకున్నామని ప్రకటించారు. జలాంతర్గాముల వల్ల తమ రక్షణ వ్యవస్థ మరింత బలాన్ని చేకూర్చుకుంటుందని వ్యాఖ్యానించారు. బంగ్లా కొనుగోలు చేసిన ఈ జలాంతర్గాముల ప్రభావంతో చైనాతో ఆ దేశానికి రక్షణ, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని విశ్లేషకుల అభిప్రాయం.