: ఏకే-47 లను వికెట్లుగా పెట్టి క్రికెట్ ఆడుకున్న ఉగ్రవాదులు!
క్రికెట్ పై మోజు ఉన్న వాళ్లు.. ఏమాత్రం తీరిక, అవకాశం దొరికినా ఆడేందుకు సిద్ధమైపోతారు. బాల్, బ్యాట్ ఉంటే చాలు, వికెట్ల స్థానంలో కర్రలో, రాళ్లో ఉంచి రెడీ అయిపోతారు. లేకపోతే, గోడకు మూడు గీతలు గీసి అవే వికెట్లుగా ఫిక్సయి పోయి క్రికెట్ ఆడే వాళ్లూ లేకపోలేదు. అయితే, ఎక్కడ మారణహోమం సృష్టిద్దామా, ఆత్మాహుతి దాడులకు పాల్పడదామా అని చూసే ఉగ్రవాదులకూ క్రికెట్ పై మోజు పుట్టింది. తమ చేతుల్లో నిరంతరం ఉండే ఏకే 47 గన్స్ ని వికెట్లుగా పెట్టుకుని క్రికెట్ ఆడిన సంఘటన జమ్మూకాశ్మీర్ లో జరిగింది. హిజ్బుల్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు తమ తుపాకులను వికెట్లుగా పెట్టి ఆట ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఓ ఆంగ్లఛానెల్ ప్రసారం చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.