: నోబెల్ పురస్కార గ్రహీత లీయూ జియాబో ఇకలేరు!


నోబెల్‌ పురస్కార గ్రహీత లీయూ జియాబో (61) ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయ‌న కాలేయ కేన్సర్ వ్యాధితో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్ర‌జ‌లకు స్వేచ్ఛ ఉండాలంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తోన్న ఆయ‌నను చైనా ప్రభుత్వం దశాబ్ద కాలంగా జైలులో బంధించింది. ఇటీవలే మెడికల్ పెరోల్ పై విడుదల చేసింది. లీయూ జియాబో పోరాటాన్ని గుర్తించిన నోబెల్ అవార్డు నిర్వాహ‌కులు 2010లో ఆయ‌న‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి ప్రకటించారు. అయితే, ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్లడానికి ప్రభుత్వం ఆయనకు అనుమతి ఇవ్వలేదు.        

  • Loading...

More Telugu News