: ఔట‌ర్ రింగ్ రోడ్డుపై డివైడర్ ను ఢీకొన్న కారు.. ముగ్గురి మృతి


వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటన రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఔట‌ర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. డివైడర్ ను ఢీకొన్న ఆ కారు అనంత‌రం ప‌ల్టీ కొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తోన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మ‌రో వ్య‌క్తికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని గాయాల‌పాల‌యిన వ్య‌క్తిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుల బంధువుల‌కు ఈ స‌మాచారాన్ని అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌మాదానికి గురైన కారు నెంబరు ఏపీ 29 బీవీ 5472 అని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News