: సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసు ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి పరిస్థితి విషమం!
హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ ఆఫీసు ముందు ఓ కుటుంబం ఈ రోజు సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్పులు సహా గుండెజబ్బు సమస్యతో బాధపడుతుండటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆత్యహత్యకు యత్నించిన నాగరాజు (40), కూతురు నవ్య (13), మేనల్లుడు శ్రీనివాస్ (18)ను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, నాగరాజు, శ్రీనివాస్, నవ్యలు సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందినవారిగా గుర్తించారు.