: ఉపరాష్ట్రపతి అభ్యర్థి గురించి ఆరెస్సెస్ కార్యకర్తలతో అమిత్ షా చర్చలు
ఆగస్టు 5న జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫు అభ్యర్థి గురించి చర్చించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ నేతలు భయ్యాజీ జోషి, కృష్ణ గోపాల్‌తో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమావేశమయ్యారు. వీరు ఢిల్లీలోని ఆరెస్సెస్ ముఖ్య కార్యాలయం కేశవ్ కుంజ్‌లో అరగంటకు పైగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత ఒకట్రెండు రోజుల్లో పార్లమెంటరీ సమావేశం ఏర్పరచి అధికార పక్షం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎవరు పోటీచేయాలనే విషయాన్ని నిర్ణయించనున్నారు.