: ఇళ్ల నిర్మాణానికి నారా లోకేష్ శంకుస్థాపన
ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద 2,200 గృహాలు నిర్మించే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రూ. 33 కోట్ల వ్యయంతో ఈ గృహ సముదాయ నిర్మాణాన్ని మైదుకూరు నియోజకవర్గంలో చేపట్టనున్నారు. ఈ పథకాన్ని అంబేద్కర్ 125వ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.