: కుల్‌భూషణ్ జాదవ్ తల్లికి వీసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న పాకిస్థాన్
భారత నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కి పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. కుల్‌భూషణ్ కు విధించిన శిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే కూడా విధించి, ఆయనను చూసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా చెప్పింది. కులభూషణ్ తల్లి అవంతిక జాదవ్ తన కుమారుడిని చూసేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. దీనిపై పాకిస్థాన్ సానుకూలంగా స్పందించింది. ఆమెకు వీసా ఇచ్చే విషయం ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది.
కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ విదేశాంగ మంత్రికి భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఇదే విషయమై సంప్రదించారు. ఆ సమయంలో పాక్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సుష్మాస్వరాజ్.. సర్తాజ్ అజీజ్‌పై మండిపడ్డారు. తాజాగా పాక్ సానుకూలంగా స్పందించడం గమనార్హం.