: ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను జైలుకు పంపాలి: రేవంత్‌ రెడ్డి డిమాండ్


టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై నిర్భయ కేసు పెట్టి జైలుకు పంపాలని టీడీపీ తెలంగాణ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రీతిమీనా ప‌ట్ల శంక‌ర్ నాయ‌క్‌ దురుసుగా ప్రవర్తించిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్ర‌వ‌ర్త‌న రాష్ట్రంలో మహిళా అధికారుల పరిస్థితికి అద్దం ‌ప‌డుతోంద‌ని అన్నారు. ఇంత‌టి త‌ప్పుచేసిన ఎమ్మెల్యేపై సాధారణ సెక్షన్లపైనే కేసులు పెట్టార‌ని ఆయ‌న అన్నారు. అంతేగాక బెయిల్ కూడా ఇచ్చార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇటువంటి నేత‌ను టీఆర్‌ఎస్ త‌మ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని అన్నారు. స‌ద‌రు ఎమ్మెల్యే ప్ర‌వ‌ర్త‌న‌పై తాము మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.   

  • Loading...

More Telugu News