: అగ్రిగోల్డ్ కు మరో ఏజెంట్ బలి!
అగ్రిగోల్డ్ కు మరో ఏజెంట్ బలయ్యాడు. విశాఖ జిల్లా కశింకోటలో అగ్రిగోల్డ్ ఏజెంట్ నూకరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కస్టమర్లకు బాకీలు తీర్చలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని బంధువులు అంటున్నారు. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ, విశాఖలోని కేజీహెచ్ దగ్గర ఏజెంట్లు, సీపీఐ నేతలు నిరసనకు దిగారు. అగ్రిగోల్డ్ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఏజెంట్ల మరణాలను ఆపాలని డిమాండ్ చేశారు.