: దీపికా ఫొటో అర్థంకాక అయోమయంలో నెటిజన్లు!
ఆలియా భట్, ప్రియాంక చోప్రాల తర్వాత ఎక్కువ మంది ఫాలోవర్లతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటి దీపికా పదుకొనె. ఇటీవల ఫొటోషేరింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రాంలో ఆమె ఒక ఫొటో షేర్ చేసింది. దానికి సంబంధించి ఎలాంటి వివరణ తాను రాయలేదు. దీంతో నెటిజన్లు అదేంటో, ఎందుకు పెట్టిందో తేల్చుకోలేక ఊహాగానాలు మొదలు పెట్టారు. `రణబీర్ నీకైనా తెల్సా అదేంటో?` అని ఒక తుంటరి కామెంట్ చేస్తే, `ఇది ఫ్రెంచ్ దేశ సైన్యం చిహ్నం` అంటూ మరికొందరు వివరణ ఇచ్చారు. ఎక్కువ మంది మాత్రం అదేంటో తెలీక దీపికాను ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఇక ఆమె అభిమానులు మాత్రం వాళ్లకేదో అర్థమైనట్లుగా `సూపర్ దీపికా`, `గ్రేట్ వర్క్`, `ఆసమ్`, `అమేజింగ్` అంటూ కామెంట్ చేశారు. ఇప్పటికీ ఇదేంటన్న విషయం గురించి దీపికా ఇంకా సమాధానం ఇవ్వలేదు. మీకేమైనా తెలుసేమో చూడండి!