: కొత్త ప్లాన్ తో వినియోగదారుల ముందుకు వచ్చిన ఎయిర్‌సెల్!
టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో ఇస్తోన్న పోటీతో మిగతా కంపెనీలు తమ వినియోగదారులను కోల్పోకుండా పోటీ పడి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇటీవలే జియో కొత్త ప్లాన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర కంపెనీలు కూడా మరోసారి తమ తమ కొత్త ప్లాన్లను వినియోగదారుల ముందు ఉంచుతున్నాయి. తాజాగా కొత్త ప్లాన్లను ప్రకటించిన ఎయిర్‌సెల్... ప్రీపెయిడ్ ప్యాక్ రూ.348తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని 84రోజుల పాటు అందిస్తున్నట్లు పేర్కొంది. ఇటువంటి ప్లాన్‌నే జియో కూడా ఇంకాస్త ఎక్కువ రేటుతో అంటే రూ.399తో అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, జియో 4జీ వేగంతో డేటా అందిస్తోంటే ఎయిర్‌సెల్ మాత్రం 3జీ వేగంతో అందిస్తోంది. ప్రస్తుతం ఉత్తర యూపీలో ఉన్న ఎయిర్‌సెల్ కొత్త ప్లాన్ త్వరలోనే అన్ని ప్రాంతాల్లోను అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.