: మళ్లీ నంద్యాల ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ సిద్ధమైంది: వైసీపీ నేత బొత్స


మళ్లీ నంద్యాల ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ సిద్ధమైందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్నూలు జిల్లా ప్రజలకు చంద్రబాబు 33 హామీలిచ్చారని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. టీడీపీ తాటాకు చప్పుళ్లకు నంద్యాల ప్రజలు భయపడరని, ఆ పార్టీని గెలిపించేందుకు ఇక్కడి ప్రజలు అంత అమాయకులు కాదని అన్నారు. దుష్టశక్తులకు గుణపాఠం చెప్పాలని, టీడీపీ తప్పుడు హామీలను ప్రజలు నమ్మరని విమర్శించారు. వైఎస్సార్ పాలనను తిరిగి తీసుకురావాలని ప్రజలను కోరారు. కాగా, వైసీపీకి చెందిన మరో నేత అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, రూ.800 కోట్లు ఎగ్గొట్టిన కేశవరెడ్డిని ప్రభుత్వమే కాపాడుతోందని, బాధితులకు న్యాయం చేసిన తర్వాతే నంద్యాల్లో ఓట్లు అడిగే హక్కు టీడీపీకి ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News