: ఒకే పాట... పది మంది గాయకులు.. బాలీవుడ్ సినిమాలో!
రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ జంటగా నటిస్తున్న `జగ్గా జాసూస్` సినిమాలో ఒకటే పాటను పది మంది గాయకులు పాడారు. డిటెక్టివ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొత్తం 29 పాటలు ఉంటాయని, హీరో ఏది మాట్లాడినా పాట రూపంలో చెబుతాడనే విషయాలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ఇందులో ఒకే పాటను పది మంది గాయకులు పాడారన్న వార్త చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుంది.
హిందీలో మ్యూజికల్ కామెడీ సినిమాలు రావడం అరుదు. ఈ సినిమా బాలీవుడ్‌కు ఓ కొత్త జోనర్‌ను పరిచయం చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రీతమ్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి `ఖానా ఖాకే` అనే పాటను ఆయనతో పాటు, అమితాబ్ భట్టాచార్య, తుషార్, గీత్ సాగర్, జూనే, అంతర, అమిత్, అశ్విన్, ఆరోహ్, సన్నీలు ఆలంపించారు. ఈ సినిమా జూలై 14న విడుదలకానుంది.