: మోదీపై నమ్మకం... రూ. 9 వేల కోట్ల ఇండియా బాండ్లు కొనుగోలు చేసిన అమెరికన్ సంస్థ


భారత ప్రభుత్వం జారీ చేసిన రూ. 9 వేల కోట్ల విలువైన బాండ్లను అమెరికన్ ఫండ్ మేనేజ్ మెంట్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కొనుగోలు చేసింది. ఓ అంతర్జాతీయ ఇన్వెస్టర్ 'ఇండియా సావరిన్' బాండ్లను కొనుగోలు చేసిన రెండవ అతిపెద్ద డీల్ ఇదే కావడం గమనార్హం. ఆసియా దేశాల్లో ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం, నరేంద్ర మోదీ ప్రధానిగా వచ్చిన తరువాత వేగంగా సంస్కరణల అమలు తదితరాలు నమ్మకం పెంచినందునే విదేశీ ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారని ఆర్థిక నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సోమవారం నాడు రూ. 1,500 కోట్ల విలువైన బాండ్లను కొన్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఆపై నేడు రూ. 7,500 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఇటీవల జీఎస్టీ అమల్లోకి రావడం భారత్ కు ప్లస్ పాయింట్ అయిందని, అదే అంతర్జాతీయ సంస్థలకు ఇండియాను ఆకర్షణీయంగా మార్చిందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, గత వారం రోజుల వ్యవధిలో భారత బాండ్ల విలువ 10 బేసిస్ పాయింట్లు పెరిగింది.

  • Loading...

More Telugu News