: రోడ్డుపై రెండుగా విడిపోయిన బస్సు.. షాక్ కు గురైన ప్రయాణికులు!
రోడ్డుపై వెళుతున్న ఓ బస్సు సగానికి చీలిపోయిన సంఘటన దక్షిణ బ్రెజిల్‌లోని పల్‌హోకా, ఫ్లోరియాపోలిస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనను చూసిన ఆ బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అదృష్టవశాత్తు ఆ బస్సులోని ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ బస్సు కొంతదూరం వెళ్లాక ముందుగా కొన్ని శబ్దాలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు బస్సు మధ్య భాగం నుంచి పక్కకు జరిగారు. తర్వాత కొన్ని క్షణాలకే బస్సు రెండుగా విడిపోయింది. ఈ వీడియోను మీరూ చూడండి...