: ఖాన్‌త్రయంతో మరోసారి జతకడుతున్న కత్రినా!
ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ - బాలీవుడ్‌లో వీరి సినిమాలు క్రియేట్ చేసే సెన్సేషన్ అంతా ఇంతా కాదు, వసూళ్ల వర్షం కురిపిస్తాయి. మరి అలాంటి ఖాన్‌త్రయంతో మరోసారి కలిసి నటించే ఛాన్స్ వస్తే నిజంగా అదృష్టమే మరి! అదే విషయాన్ని కత్రినా కైఫ్ కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే ఆమిర్‌తో కలిసి `ధూమ్ 3`, షారుక్‌తో `జబ్ తక్ హై జాన్`, సల్మాన్‌తో `ఏక్ థా టైగర్`, `పాట్నర్` వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కత్రినా నటించింది.
త్వరలో ఆమిర్‌తో `థగ్స్ ఆఫ్ హిందుస్థాన్`, షారుక్‌తో ఆనంద్ ఎల్ రాయ్ తీసే సినిమాలోను, అలాగే సల్మాన్‌తో `ఏక్ థా టైగర్` సీక్వెల్ `టైగర్ జిందా హై` సినిమాల్లో కత్రినా నటిస్తోంది. సల్మాన్‌తో ఇంతకుముందు కత్రినా కొన్ని సినిమాల్లో నటించినా కరీనా కపూర్, విద్యాబాలన్, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే వంటి హీరోయిన్ల నుంచి పోటీని తట్టుకుంటూ అవకాశాలు చేజిక్కించుకోవడం చిన్న విషయం కాదని సినీవర్గాల అభిప్రాయం. రణబీర్ కపూర్ సరసన కత్రినా నటించిన `జగ్గా జాసూస్` సినిమా త్వరలో విడుదలకానున్న సంగతి తెలిసిందే!