: శశికళకు అంతసీను లేదు... రూప చెప్పిందంతా అబద్ధమేనన్న కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ
ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ, అధికారులకు రెండు కోట్ల రూపాయల ముడుపులు చెల్లించి సకల సౌకర్యాలను, రాజ భోగాలనూ అనుభవిస్తున్నారని వచ్చిన నివేదికను కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ రావు తీవ్రంగా ఖండించారు. శశికళను ఓ సాధారణ ఖైదీగానే చూస్తున్నట్టు స్పష్టం చేశారు. డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ ప్రిజన్స్ రూపా మోడ్గిల్ ఇచ్చిన నివేదిక అవాస్తవమని స్పష్టం చేశారు.
శశికళకు తాము ఎటువంటి ప్రత్యేక సదుపాయాలనూ కల్పించలేదని తెలిపారు. రూప తప్పుడు నివేదికను ఎందుకు ఇచ్చారో తనకు తెలియదని అన్నారు. తాను రూ. రెండు కోట్లు తీసుకున్నానని ఆమె ఇచ్చిన నివేదిక సత్య దూరమని చెప్పిన ఆయన, తాము కోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామని అన్నారు. రూప ఇచ్చిన నివేదిక సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.