: కేటీఆర్... మావాళ్లు చూడండి ఏం చేస్తున్నారో!: నాగార్జున


తెలంగాణ రాష్ట్రంలో హరితహారం ముమ్మరంగా సాగుతున్న వేళ, తన అభిమానులు మొక్కలు నాటుతున్న ఫోటోలను హీరో నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలు పెడుతూ, వాటిని ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. పర్యావరణం కోసం తన అభిమానులు తమవంతు సాయం చేస్తున్నారని, ఇందుకు తనకెంతో గర్వంగా ఉందని నాగార్జున చెప్పారు. అభిమానులు విద్యార్థులకు మొక్కలు పంచుతున్న దృశ్యాలను, ఆపై మొక్కలు నాటుతున్న దృశ్యాలను నాగ్ ట్విట్టర్ లో ఉంచారు.

  • Loading...

More Telugu News