: న్యూయార్క్ లో సేద తీరుతున్న కోహ్లీ, అనుష్క


పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు న్యూయార్క్ లో సేదతీరుతున్నారు. ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీసుల్లో పాల్గొన్న విరాట్ అటు నుంచి అటే న్యూయార్క్ చేరుకున్నాడు. న్యూయార్క్ లో జరగనున్న ఐఫా అవార్డుల కార్యక్రమం నిమిత్తం అనుష్క అక్కడకు వెళ్లింది. 15వ తేదీన ఐఫా ఈవెంట్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో, ప్రేమ పక్షులు న్యూయార్క్ లో వాలాయి. ఈ సందర్భంగా అనుష్కతో కలసి ఉన్న ఓ ఫొటోను కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 'మచ్ నీడెడ్ బ్రేక్ విత్ మై లవ్' అంటూ కామెంట్ పెట్టాడు.

  • Loading...

More Telugu News