: భావనపై హీరో దిలీప్ అంత కక్షను పెంచుకోవడానికి కారణమేమిటంటే... !


దక్షిణాది హీరోయిన్ భావనపై మనుషులను పెట్టి అత్యాచారం చేయించేంత కక్షను హీరో దిలీప్ ఎందుకు పెంచుకున్నాడు? దిలీప్ ను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసు అధికారులు, ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం దిలీప్ భార్యగా ఉన్న కావ్యా మాధవన్, సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో దిలీప్ ఆమెతో రహస్యంగా ప్రేమాయణాన్ని నడిపారు. అప్పుడు దిలీప్ భార్యగా ఉన్న మంజు వారియర్ (తదుపరి విడాకులు ఇచ్చాడు) కు భావనే ఈ విషయాన్ని చేరవేసిందన్న కక్షతో దిలీప్ ఆగ్రహంతో ఊగిపోయాడు.

2013లోనే ఆమెను అవమానించాలని ప్లాన్ వేశాడు. పల్సర్ సునీతో చర్చలు జరిపాడు. ఆమెపై అత్యాచారం చేస్తున్న వేళ వీడియో తీయాలని, ఫోటోలు క్లారిటీతో ఉండాలని, అందుకు రూ. 1.5 కోట్లు ఇస్తానని చెప్పాడు. ఇక ఈ వీడియోలు కావ్యా మాధవన్ కు ఇచ్చేందుకు పల్సర్ సునీ లేదా విఘ్నేష్ లు వెళ్లారా? లేదా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కుట్ర మొత్తానికి దిలీప్ సూత్రధారి అయితే, మిగతా నిందితులు పాత్రధారులని తెలిపాయి.

  • Loading...

More Telugu News