: రేప్ చేశావంటూ బ్లాక్ మెయిల్.. షార్ట్ ఫిలిమ్స్ నటి అరెస్టు!
సంబంధం పెట్టుకుని, డబ్బులివ్వకపోయేసరికి అత్యాచారం చేశావని కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేసిన నటి పూజా జాదవ్ ను పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... ముంబైకి చెందిన ఒక సంస్థ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ లో పూజా జాదవ్ అనే నటి నటించింది. ఆ సమయంలో ఒక యువకుడి నుంచి కొంత డబ్బు తీసుకుని, అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. అనంతరం 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దానికి అతను నిరాకరించడంతో అత్యాచారం చేశావని కేసు పెడతానని బెదిరింపులకు దిగింది.
దానికి కూడా అతను తలొగ్గకపోవడంతో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసింది. దీంతో అతను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం అతనిపై దాడి చేయడమే కాకుండా అతని వద్దనున్న 6000 రూపాయలు తీసుకుని వెళ్లిపోయింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి రెండేళ్ల క్రితం అలాగే ఒకరిని ఆమె వేధించిందని గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. విచారణ కోసం ఒకరోజు కస్టడీకి పోలీసులు కోరడంతో అందుకు న్యాయస్థానం అంగీకరించింది.