: ఉదారస్వభావులకే సంతోషం ఎక్కువ!: తాజా అధ్యయనంలో వెల్లడి
స్వార్థపరుల కంటే ఉదారంగా ఉన్నవారే ఎక్కువ సంతోషంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలాంటి వారు ఎక్కువ ఆనందంగా ఉంటారు? అంటూ వివిధ పరిశోధనలు నిర్వహించిన స్విట్జర్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్ శాస్త్రవేత్తలు ఆసక్తికర అంశం వెల్లడించారు. నాది, నేను, నాకు అనుకునే స్వార్థ పరుల కంటే మనది, మనం, మనకు అనుకునే ఉదార స్వభావులు ఎక్కువ ఆనందంగా ఉంటారని చెప్పారు.
ఇతరుల పట్ల దాతృత్వం చూపేవారికి వారి మెదడు ఆహ్లాదకర భావనను కలగచేస్తుందని, అందుకే వారు స్వార్థపరుల కంటే ఆనందంగా ఉండగలుగుతారని వారు వెల్లడించారు. సంతోషంగా ఉండాలంటే ఉదార స్వభావం అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. స్వార్థపరులు సంతోషంగా ఉన్నప్పటికీ ఉదార స్వభావం కలవారు ఉండేంత ఆనందంగా ఉండలేరని వారు తెలిపారు.