: శశికళ శిక్ష అనుభవించడానికి వచ్చినట్టు లేదు, హాలీడే ట్రిప్ కు వచ్చినట్టుంది!: కలకలం రేపుతున్న కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ లేఖ


బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక వంటగది వసతి కల్పించారన్న విషయం బయటకు పొక్కడంతో పెనుకలకలం రేగుతోంది. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప ఆ శాఖ డీజీపీ సత్యనారాయణకు జైలులోని అక్రమాలపై లేఖ రాశారు. దీంతో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఆరు పేజీల లేఖలో జైలులోని అక్రమాలపై ఆమె వివరించారు. కేవలం శశికళకు మాత్రమే కాదని, కొందరు ప్రత్యేక ఖైదీలుగా ఉన్నవారికి కూడా ఇలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం వెనుక జైళ్ల శాఖ ఉన్నతాధికారికి 2 కోట్ల రూపాయల ముడుపులు దక్కాయని ఆమె వివరించారు. దీంతో ఈ జైలులో ఖైదీలు శిక్షను హాలీడే లా ఎంజాయ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 

  • Loading...

More Telugu News