: ఈ దేశానికి క్రికెట్ కంటే ‘బిగ్‌బాస్’ చాలా ముఖ్యం.. చట్టమే నన్ను రక్షిస్తుంది: కమలహాసన్


ఈ దేశానికి క్రికెట్ కంటే ‘బిగ్‌బాస్’ చాలా ముఖ్యమని తమిళ ప్రముఖ నటుడు కమలహాసన్ పేర్కొన్నారు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను ‘బిగ్‌బాస్’ షోతో కమల్ దెబ్బతీస్తున్నారని హిందు మక్కల్ కట్చి (హెచ్ఎంకే) ఆరోపిస్తూ కమల్‌పై కేసు నమోదు చేసింది. దీనిపై కమల్ మీడియాతో మాట్లాడుతూ కేసుపై తానేమీ మాట్లాడబోనన్నారు. ప్రజలకు క్రికెట్ కంటే కూడా బిగ్‌బాస్ షో చాలా ముఖ్యమైనదని అన్నారు. వృత్తిలో తానెన్ని కష్టాలు పడుతున్నానని విషయం మీకు తెలియదన్న కమల్, ‘దశావతారం’ సినిమా చూసి తనను అభినందించిన వారే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బిగ్‌బాస్’ వివాదాస్పదంగా మారిందన్నారు. చట్టం తనను కాపాడుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. భావన కేసులో మలయాళ నటుడు దిలీప్ అరెస్ట్‌పై స్పందిస్తూ బాధితురాలికి సంఘీభావం తెలిపారు.

  • Loading...

More Telugu News