: భాగస్వామితో పెళ్లికి సిద్ధమైన మణిపూర్ ఉక్కు మహిళ.. రిజిస్ట్రార్ ఆఫీసులో దరఖాస్తు సమర్పణ


మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల (45) వివాహానికి సిద్ధమవుతున్నారు. బ్రిటిషర్ అయిన తన స్నేహితుడు డెస్మాండ్ కౌటినోను పెళ్లాడేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆమె దరఖాస్తు సమర్పించారు. ఇటీవల జరిగిన మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో షర్మిల ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికల అనంతరం తమిళనాడుకు చేరుకున్న ఆమె ప్రస్తుతం కొడైకెనాల్‌ సమీపంలోని పెరుమలమలై వద్ద కాటేజీలో ఉంటున్నారు. షర్మిల సమర్పించిన దరఖాస్తును కొడైకెనాల్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ తన నోటీసు బోర్డులో ప్రదర్శించి అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా కోరింది.

తాను శాంతిని వెతుక్కుంటూ ఇక్కడకు చేరుకున్నానని, ఇప్పుడది తనకు దొరికిందని షర్మిల పేర్కొన్నారు. మరో 30 రోజుల్లో కొడైకెనాల్‌లోనే తాము వివాహం చేసుకోబోతున్నట్టు తెలిపారు. వివాదాస్పద సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లపాటు తాను నిరశన దీక్ష చేపట్టిన తర్వాత కూడా మణిపూర్‌లోని రాజకీయ వాతావరణం ఏమాత్రం మారలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News