: హైదరాబాదులో పేకాడుతూ పట్టుబడ్డ తమిళ సినిమా యూనిట్ సభ్యులు!


తమిళ సినిమా ‘శాపపురం’ షూటింగ్ యూనిట్ సభ్యులు పేకాడుతూ పట్టుబడిన సంఘటన హైదరాబాద్ లోని మౌంట్ ఒపేరాలో జరిగింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రోజు నిర్వహించిన దాడుల్లో వారు పట్టుబడ్డారు. వారి నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా, పట్టుబడిన వారిని విడిపించేందుకు ఓ యువ హీరో ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని మీడియాలో వార్తలు వెలువడటం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News