: జగన్ ను చూసి టీడీపీ భయపడుతోంది: వైసీపీ నేత కన్నబాబు


తమ పార్టీ అధినేత జగన్ ను చూసి టీడీపీ భయపడుతోందని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని, తన గొప్పల కోసం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా జగన్ తలపెట్టనున్న పాదయాత్ర గురించి ఆయన ప్రస్తావించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జగన్ తన పాదయాత్రను పూర్తి చేస్తారని, జగన్ ప్రకటించిన పథకాలను వాడవాడలా తీసుకువెళ్తామని అన్నారు.

  • Loading...

More Telugu News