: కేంద్ర సాయుధ దళాల వైద్యాధికారులకు శుభవార్త!


కేంద్ర సాయుధ దళాల్లో పని చేస్తున్న వైద్యాధికారులకు శుభవార్త! వారి పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఈ రోజు ఓ అధికారిక ప్రకటన విడుదలయింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో కేంద్ర సాయుధ దళాల పరిధిలోకి వచ్చే ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఎస్జీ, సశస్త్ర సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ లో పనిచేసే స్పెషలిస్టులు, జనరల్ డ్యూటీ మెడికల్ కేడర్ అధికారులు తమ సేవలను రోగుల సంరక్షణకు, వైద్య కళాశాలల్లో బోధనా పరంగానూ అందించే అవకాశం ఉంటుంది.

  • Loading...

More Telugu News